నవతెలంగాణ – పరకాల : పరకాల పట్టణ మున్సిపల్ పరిధిలోని గృహవాసాల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లను చెత్తాచెదారం లేకుండా శుభ్రపరచుకోవాలని మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ తెలిపారు. ఖాళీ ప్లాట్లను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల పిచ్చి మొక్కలు, గుంతలు ఏర్పడి దోమలు ఈగలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని శనివారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో సుష్మ పేర్కొన్నారు. తక్షణమే ఖాలీ ప్లాట్ల యజమానులు తమ తమ ప్లాట్లలోని పిచ్చి మొక్కలు చెత్తాచెదారం తొలగించి, గుంతలు ఉన్నచోట మొరంతో లెవెల్ చేయాలన్నారు. ఖాళీ ప్లాట్ల యజమానులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో పారిశుధ్య సమస్య ఏర్పడుతుందని ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని కమిషనర్ తెలిపారు.
ఖాళీ ఫ్లాట్లలోని చెత్తను తొలగించాలి: మున్సిపల్ కమిషనర్ సుష్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES