నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ కరాచిలో ఓ నివాస భవనంలో గురువారం ఉదయం గ్యాస్ లేకేజి కారణంగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 16 మంది మంది మృతి చెందారు. మృతుల్లో చాలామంది చిన్నారులున్నారు. 14 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి జామ్‌షెడ్ అషెర్ మాట్లాడుతూ.. ‘ఓల్డ్ సోల్జర్ బజార్ ప్రాంతంలో ఉన్న భవనంలోని మొదటి అంతస్తులో ఈరోజు ఉదయం 4.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈరోజు రంజాన్ మాసం ప్రారంభం కానుంది. అందుకే తెల్లవారుజామున ముస్లింలు సెహ్రీ (ఉపసవాసం సందర్భంగా తెల్లవారుజామున తీసుకునే ఆహారం) సందర్భంగా అందరూ మేల్కొని ఉన్నారు. ఈ సమయంలోనే ఈ పేలుడు సంభవించింది’ అని ఆయన అన్నారు.
కాగా, ఈ ఘటన గ్యాస్ లీకేజీ వల్లనే జరిగిందని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. కరాచిలో గ్యాస్ కొరత తీవ్రస్థాయిలో ఉంది. చాలామంది తక్కువ ఆదాయం వస్తున్న వారు. తమ ఇళ్లల్లో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్‌లను ఉపయోగిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ సర్జన్ డాక్టర్ సమయా సయ్యద్ ధృవీకరించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు కారణంగా భవన నిర్మాణంలో ఒక భాగం కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి.. ఘటనలో స్థలంలో ఇంకెవరి మృతదేహాలున్నాయేమోనని వెతుకుతున్నట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ హుమాయున్ ఖాన్ అన్నారు.
మృతుల్లో రెండేళ్లు నుంచి 17 ఏళ్ల మధ్య వయసు గల తొమ్మిది మంది పిల్లలున్నారు. గాయపడిన వారిలో కూడా ఏడుగురు పిల్లలున్నారు.కేవలం నెల రోజుల వ్యవధిలోనే కరాచిలో జరిగిన రెండవ అతిపెద్ద విషాదం ఇది. గత నెలలో సద్దార్ ప్రాంతంలోని హోల్‌సేల్ రిటైల్ మార్కెట్ అయిన గుల్ షాపింగ్ ప్లాజా బేస్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 79 మంది మృతి చెందారు. అనేక మంది గాయాలపాలయ్యారు.



