Tuesday, March 24, 2026
E-PAPER
Homeనిజామాబాద్ప‌ల్లెటూరులో మొద‌లైన గ్యాస్ క‌ష్టాలు

ప‌ల్లెటూరులో మొద‌లైన గ్యాస్ క‌ష్టాలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్‌: ప‌శ్చిమాసియా యుద్ధ పుణ్యామ‌ని క‌ట్టెల పొయ్యికి గిరాకీ పెరిగింది. సిటీలో తీవ్ర గ్యాస్ కొర‌త‌తో వంట‌లకు తిప్ప‌లు వచ్చాయి. గ్యాస్ స‌కాలంలో లభించ‌క ప‌లు వ్యాపారాలు మూత‌ప‌డ‌గా..మ‌రికొన్ని రేట్లు పెంచి త‌మ బిజినెస్‌ల‌ను కొన‌సాగిస్తున్నాయి. అదే విధంగా ప‌ల్లెటూరులో కూడా గ్యాప్ కొర‌త‌ పెరిగింది. దీంతో మహిళలు శివారు ప్రాంతానికి వెళ్లి వంట కోసం కట్టెలు తెచ్చుకుంటున్నారు. మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా గ్రామంలో నెలరోజులైనా సిలిండర్లు లభించకపోవడం మహిళలు కట్టెల కోసం అన్వేష‌ణ‌ మొదలుపెట్టారు. దాదాపుగా గ్రామంలో 50 శాతానికి పైగా గ్యాస్‌పై ఆధారంపడ్డాయి. ప‌శ్చిమాసియా యుద్ధంకార‌ణంగా గ్యాస్ ల‌భించ‌క‌పోవ‌డంతో క‌ట్టెల పొయ్యిపై వంట‌లకు స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వంటింట్లో పొగ క‌ష్టాలు భ‌రించ‌డం క‌ష్ట‌మని నిరుపేదలు ఆందోళ‌న చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -