Saturday, November 29, 2025
E-PAPER
Homeబీజినెస్సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతం

సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతం

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌ తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8.2 శాతంగా నమోదయ్యిం దని కేంద్ర గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఓ ) వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమా సికంలో జిడిపి 5.6 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన క్యూ2లో మూల ధన వ్యయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. గ్రామీణ స్థాయిలో విని యోగం పెరగడం, ప్రభుత్వ వ్యయం లో పెరుగుదల జీడీపీకి మద్దతును అందించిందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన తయారీ రంగం 9.1 శాతం పెరుగు దలను నమోదు చేసింది. గతేడాది ఈ రంగం వృద్ధి 2.2 శాతంగా నమోద య్యింది. జీడీపీలో 57 శాతం వాటా కలిగిన ప్రయివేటు సెక్టార్‌ వ్యయంలో గడిచిన క్యూ2లో 7.9 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 7.0 శాతంగా నమోదయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -