Sunday, May 4, 2025
Homeజాతీయంఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: అహ్మద్‌ఖాన్‌

ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: అహ్మద్‌ఖాన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో … భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ … కర్నాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. కర్నాటక మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ … ” పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్‌ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోడి, కేంద్రమంత్రి అమిత్‌ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్‌ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను ” అంటూ కామెంట్స్‌ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -