Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ స్థలం ఇప్పించండి హాస్పిటల్ నిర్మిస్తా…

ప్రభుత్వ స్థలం ఇప్పించండి హాస్పిటల్ నిర్మిస్తా…

- Advertisement -

కానుగంటి నరసింహారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: ప్రభుత్వ స్థలం ఇప్పిస్తే హాస్పిటల్ నిర్మిస్తానని రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన కానుగంటి నరహారెడ్డి పద్మ దంపతులు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ ను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజా సేవ చేసి ఎందుకు ముందుకు రావడానికి అభినందిస్తూ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఉన్న  ఊరు కన్న తల్లి లాంటిది అంటారు ఆ రుణం తీర్చుకునేందుకు అందరికీ అవకాశం రాదు అవకాశం వచ్చిన వినియోగించుకోవడంలో ముందుకు వచ్చినవారు బహు కొద్ది మంది ఉంటారు. అందులో కానుగంటి నరసింహారెడ్డి పద్మ దంపతులు ముందంజలో ఉంటారని అన్నారు.  తమ వంతు సమాజానికి సేవ చేయాలనే విశాల దృక్పథంతో రాజుపేట మండలం రఘునాధ పురం గ్రామానికి చెందిన కానుగంటి నరసింహారెడ్డి పద్మ దంపతులు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ హనుమంతరావు ను స్వయంగా  కలిసి తమ వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేయడానికి ముందుకు వచ్చామని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించగలిగితే హాస్పిటల్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వృద్ధ దంపతులిద్దరిని సన్మానిస్తూ సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం గర్వకారణంగా ఉందని, తప్పనిసరిగా సహకారం అందించగలమని ఇదే రీతిలో పలువురు దాతలు స్పూర్తినందుకొని ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -