రెండేండ్లలో రూ.3 లక్షల కోట్ల నష్టం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన అధిక సుంకాలు గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలను బెంబేలెత్తుస్తున్నాయి. ఆదాయాలు భారీగా దెబ్బతినవచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. అమెరికా సుంకాల వల్ల గ్లోబల్ కంపెనీలు 35 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు) పైగా అదనపు వ్యయాలు ఎదుర్కొన్నాయని రాయిటర్స్ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇది ఆ కంపెనీలకు నష్టంగా మారొచ్చని విశ్లేషించింది. అయితే.. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల నుండి కొత్త వాణిజ్య ఒప్పందాలు కొంత ఉపశమనం కల్పించనున్నాయని పేర్కొంది. ట్రంప్ వాణిజ్య యుద్ధం యుఎస్ సుంకాలను 1930ల నాటి గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో కంపెనీలు తమ ఖర్చు అంచనాలను తగ్గించాయి. మరోవైపు ధరల పెంపు వంటి ప్రణాళికలు రూపొందించాయి.రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం.. 2025లో కంపెనీలు 21 బిలియన్ డాలర్ల నుంచి 22.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నష్టాలను ఎదుర్కునే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది 2026లో 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.3 లక్షల కోట్లు) నష్టం ఉండొచ్చు. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా 9.5 బిలియన్ల (రూ.83వేల కోట్లు) అంచనాతో అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కోనుంది. యూరప్, జపాన్‌తో ట్రంప్ చివరగా కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అనేక కంపెనీలు తమ మునుపటి అత్యధిక నష్ట అంచనాలను తగ్గించాయి. ఉదాహరణకు, స్టెల్లాంటిస్, పెర్నోడ్ రికార్డ్ వంటి కంపెనీలు యూరప్ ఒప్పందం తర్వాత తమ నష్ట అంచనాలను తగ్గించాయి.
నష్టపోతున్న ప్రధాన రంగాలు
అధిక టారిఫ్‌లతో వినియోగదారు ఉత్పత్తులు, తయారీ రంగాలు అత్యధికంగా నష్టపోతున్నాయి. వియత్నాం వంటి ఆసియా దేశాలపై ఆధారపడే కంపెనీలు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్ లాంటి దేశాలు టెక్స్‌టైల్, ఫుట్‌వేర్, సముద్ర ఉత్పత్తులు, అభరణాల రంగాల కంపనీల ఆదాయాలు పడిపోతున్నాయి. చైనాపై కొత్త సుంకాల బెదిరింపు భవిష్యత్తులో అనిశ్చితిని మరింత పెంచొచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి.
చైనాపై టారిఫ్‌లతో కొత్త సవాళ్లు
ట్రంప్ ఇటీవల చైనాపై అదనంగా 100 శాతం సుంకాలను విధించే ఆలోచనను ప్రతిపాదిం చారు. అయితే ఈ సుంకాలు స్థిరంగా ఉండవని ఆయన తర్వాత తెలిపారు. ఈ అనిశ్చితి కంపెనీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెడు తోంది. మరోవైపు అమెరికాతో చైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోతే 155 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించడం గ్లోబల్ కంపెనీల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తుంది. ట్రంప్ విధానాలు కంపెనీల ఆదాయాలను ఒత్తిడికి గురి చేస్తున్నా యని తీవ్ర ఆందోళనలో ఉన్న గ్లోబల్ కంపెనీలను తాజాగా అమెరికా, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ ఉద్రిక్తతలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి.
టారిఫ్‌లతో గ్లోబల్ కంపెనీలకు దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES