నవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గ దేవి మండపాల నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించిన మండపాలలో దుర్గాదేవిని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
దీంతో భక్తులు అమ్మవారికి మొక్కలను చెల్లించుకున్నారు. దేవి శరన్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారి మలధారణ స్వీకరించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని గంగపుత్ర, ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించనున్న దుర్గాదేవి అమ్మవారిని గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు మంగళహారతులతో భాజా భజంత్రీల మధ్య కన్నుల పండుగ కొనసాగింది. ముధోల్ ఎస్సై బిట్ల పెర్సెస్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి ప్రతిష్టాపన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES