Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దఏడ్గిలో వైభవంగా లక్ష్మమ్మ తల్లి దేవత పండగ

పెద్దఏడ్గిలో వైభవంగా లక్ష్మమ్మ తల్లి దేవత పండగ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో గ్రామ సర్పంచ్ అనీల్ కూమార్ ఆధ్వర్యంలో గ్రామ లక్ష్మమ్మ తల్లీ దేవత పండగ ఎడ్లబండ్ల ప్రదర్శన కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ రైతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా జూన్ మాసంలో మొదటి వారం ప్రారంభంలో గ్రామ దేవతల ఆశీర్వచనము కొరకు వ్యవసాయ రైతులు తమ పనిముట్లను యంత్రాలతో వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు గ్రామ లక్ష్మీ అమ్మ తల్లి దేవత జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని ఎడ్లబండ్లను మరియు ట్రాక్టర్లను రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామదవతలైన లక్ష్మమ్మ తల్లిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైజీద్యాలు అర్పించి ముక్కులు తీర్చుకొని వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు తమకు సకల సౌకర్యాలు కల్పించి పసిడి పంటలు పండాలని, ఆర్థికంగా రైతులు బలపడాలని, కోరుతూ దేవత తల్లిని వేడుకోవడం జరుగుతుంది. అనంతరం నైవిద్యాలయం ఒకరికి ఒకరు పంచుకొని ఉమ్మడిగా గ్రామస్తులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగుతుంది అని సర్పంచ్ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, గ్రామస్తులు ,పెద్దలు , యువ రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -