Sunday, February 15, 2026
E-PAPER
Homeక్రైమ్దైవ దర్శనానికి వెళ్తూ..

దైవ దర్శనానికి వెళ్తూ..

- Advertisement -

తిమ్మన్నపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి..పలువురి పరిస్థితి విషమం
నవతెలంగాణ – ఊర్కొండ

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మనపల్లి స్టేజీ సమీపంలోని రాయచూర్‌ – కోదాడ(167) జాతీయ రహదారిపై శనివారం ఘోర ప్రమాదం జరిగింది. కర్నాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న క్రూజర్‌ వాహనం కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా కర్నాటక రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం విజయపురి జిల్లా యాదగిరి గ్రామానికి చెందిన కొందరు శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి వాహనం కల్వర్టును ఢీకొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న రాంరెడ్డి దేశారు(52) అతని భార్య మేఘనా రెడ్డి(48) కల్కేరి గ్రామానికి చెందిన మహాదేవి(65)అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులు వెల్దండ మండల కేంద్రంలోని ఎంఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మల్లమ్మ, శివమణి అప్పల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్‌ రాము స్వల్పంగా గాయపడడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊర్కొండ ఎస్సై కష్ణదేవ మృతులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -