Friday, October 10, 2025
E-PAPER
Homeబీజినెస్రూ.15 లక్షల కోట్లకు బంగారం తాకట్టు రుణాలు

రూ.15 లక్షల కోట్లకు బంగారం తాకట్టు రుణాలు

- Advertisement -

ఇక్రా రేటింగ్స్‌ అంచనా
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ముగింపు నాటికి బంగారం రుణాల మార్కెట్‌ రూ.15 లక్షల కోట్లను చేరొచ్చని రేటింగ్‌ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు వేగంగా పెరగడం, అన్ని సమయాలలో గరిష్ట స్థాయికి చేరుకో వడంతో ఈ రంగం పెరుగుదలకు దోహదం చేయొ చ్చని ఇక్రా లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎఎం కార్తీక్‌ పేర్కొ న్నారు. సంఘటిత పసిడి రుణ మార్కెట్‌ పరిమాణం 2027 మార్చి నాటికి రూ.18 లక్షల కోట్లకు పెరగవచ్చని పేర్కొ న్నారు. బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సి)ల పసిడి రుణ పోర్టుపోలియో 30-35 శాతానికి పెరగొచ్చన్నారు. ఈ మార్కెట్‌ పరిమాణం మార్చి 2025 నాటికి రూ.11.8 లక్షల కోట్లుగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -