Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయంబంగారం భగ్గుమంటోంది..

బంగారం భగ్గుమంటోంది..

- Advertisement -

10 గ్రాములు ఏ రూ. 1.18 లక్షలు
సామాన్యులకు అందనంత దూరంలో పసిడి, వెండి


న్యూఢిల్లీ : బంగారం ధర భగ్గుమంటోంది. పేదలే కాదు.. మధ్య తరగతి వాళ్లు కొనలేని స్థాయికి ఎగిసింది. 10 గ్రాముల పసిడి ధర రికార్డ్‌ స్థాయిలో రూ.1.18 లక్షలకు ఎగిసింది. అమెరికా టారిఫ్‌లు, భౌగోళిక అనిశ్చితులు, యుఎస్‌ హెచ్‌1బీ వీసా రుసం భారీగా పెంపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ వరుస పతనం బంగారం ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,650 పెరిగి అన్ని పన్నులతో కలిపి ఏకంగా రూ.1,18,300కు చేరింది. ఇంతక్రితం రోజు రూ.1,15,650 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 88 ఎగువకు పడిపోవడానికి తోడు హెచ్‌1బీ వీసా రుసుంను లక్ష డాలర్లకు చేర్చడంతో పసిడి ధర పెరుగుదలకు ప్రధాన కారణమని ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.39,950 లేదా 50.60 శాతం పెరిగింది. 2024 డిసెంబర్‌ 31 నాటికి రూ.78,950గా పలికింది. మరోవైపు తాజాగా కిలో వెండిపై ఒకే రోజు రూ.3,220 పెరిగి రూ.1,39,600కు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కిలో వెండి ధర రూ.49,900 లేదా 55.63 శాతం ఎగిసింది. 2024 డిసెంబర్‌ 31 నాటికి కిలో వెండి ధర రూ.89,700గా ఉంది. పండగ సీజన్‌లో ఆకాశాన్ని అంటిన బంగారం, వెండి ధరలతో సామాన్యుల కొనుగోళ్ల ఆశలు ఆవిరి కావడంతో పాటు.. అధిక ధరల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -