- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని ఉప్పల్ బాయి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి కే ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున యూనివర్సిటీలో 23 నుండి 25 వరకు జరిగిన 36వ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలో ట్రయథలీన్ విభాగంలో 2945 పాయింట్లతో బంగారు పతకం సాధించినట్లు పీడీ లింగం తెలిపారు. విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ శివరాం, వైస్ ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డితో పాటు పిఈటి రవీంద్ర, కోచ్ సురేష్, తదితరులు అభినందించారు.
- Advertisement -