- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
మండలంలోని గానుగట్టు తాండ గ్రామపంచాయతీ పరిధిలోని వంటి గుడిసె తండాకు చెందిన గణేష్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా మృతుని కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాగులు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, లచ్చి రామ్ నాయక్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, ఆనంద్ తో పాటు తదితరులున్నారు.
- Advertisement -



