- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి గొల్లపల్లికి ఎస్సై లావణ్య రావడంతో గురువారం గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, యువత మద్యానికి అలవాటు పడకుండా చూడాలని, సైబర్ నేరాల వలలో చిక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జనార్ధన్, బిఆర్ఎస్ నాయకులు పాల మల్లేష్, మరి భూమయ్య, మాజీ విడిసి మర్రి అంజయ్య, నారాయణ, తదితరులు ఉన్నారు.
- Advertisement -