- Advertisement -
నవతెలంగాణ ఢిల్లీ: జాతీయ రహదారులపై ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఫాస్టాగ్ లేకపోతే వాహనదారులు టోల్ వద్ద రెండింతలు చెల్లించాల్సి ఉండేది. ఇకపై కూడా నగదు చెల్లిస్తే రెండింతలే కానీ, యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 1.25 రెట్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, ఫాస్టాగ్ వాహనదారులు రూ.100 చెల్లిస్తే, ఫాస్టాగ్ లేనివారు నగదుగా రూ.200, యూపీఐ ద్వారా అయితే రూ.125 చెల్లించాలి. నిబంధనలు నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
- Advertisement -