రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నవతెలంగాణ- శంకరపట్నం
గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయినా సంఘటన శంకరపట్నం మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన అల్లెపు అంజి , అనిల్ (25) అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మొలంగూర్ శివారులోని పద్మావతి సీడ్ ప్లాంట్ వద్ద సోమవారం రాత్రి జరిగిందని గ్రామస్తులు తెలిపారు.గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అంజి అక్కడికక్కడే మృతి చెందగా బీహార్ కు చెందిన వలస కూలి రాజేష్ కు తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేష్ ను అంబులెన్స్ లో వెంటనే  ఎంజిఎంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు.

Spread the love