Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో నూతన నారాయణి పాఠశాల ప్రారంభం

మద్నూర్ లో నూతన నారాయణి పాఠశాల ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో బుధవారం నూతనంగా నారాయణి ఇంగ్లీష్ మీడియం (ప్రయివేటు) పాఠశాల అన్ని హంగులతో ప్రారంభమైంది. జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్ గంగారాం, హనుమంతు షిండే, స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, మద్నూర్, డోంగ్లి, మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ప్రజా ప్రతినిధుల మధ్య ప్రారంభ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల డీన్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు ఇక్కడ 20 ఏండ్ల అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహిస్తామని అన్నారు.

అధ్యాపకుల అనుభవంతో విద్యార్థులకు ఒత్తిడి లేని, నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు. నవోదయ, సైనిక్ ప్రవేశాల కోసం నిపుణులతో దీర్ఘకాలిక శిక్షణనందిస్తామని చెప్పారు. అంతేకాదు మా పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కూడా ఉందన్నారు. ఇక్కడ సౌకర్యవంతమైన తరగతి గదులతో పాటు విశాలమైన ప్లేగ్రౌండ్ ఉన్నాయని అన్నారు. నారాయణి పాఠశాల ప్రారంభోత్సవానికి స్కూల్ చైర్మన్ సోమూర్ కాశీనాథ్ పటేల్, వైస్ చైర్మన్ లింబూర్ బస్వంత్ రావు పటేల్, కరస్పాండెంట్, డైరెక్టర్లు అవల్గావ్ నాగనాథ్ పటేల్, ప్రధానోపాధ్యాయులు వై ఇరువంత్, మద్నూర్ మోదాని సురేష్ సేట్, కొడిచెర వీరభద్ర లతో పాటు అధిక సంఖ్యలో స్థానికులు హాజరై, విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -