- Advertisement -
- స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ కు వేతనాలు వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఆదిలాబాద్,మేడ్చల్,నారాయణపేట, జోగులాంబ గద్వాల, జనగాం, ములుగు, పెద్దపల్లి, కొమరం భీం,మహబూబాబాద్,వనపర్తి, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో సదురు ఉద్యోగులకు దాదాపు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
- Advertisement -



