Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా హాజరయ్యారు. ఫార్మలా ఈరేస్‌ నిర్వహణకు సంబంధించి నిధుల బదిలీపై ఏసీబీ అభ్యంతరం తెలిపింది. హెచ్‌ఎండీఏ నుంచి సుమారు రూ.55కోట్లు బదిలీ చేయడం, అవసరమైన ఆర్థిక విధివిధానాలు పాటించకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని నిందితులకు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కేటీఆర్‌ గత విచారణకు హాజరుకాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -