- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : 2019లో బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా భారత్‌కు తరలించిన కేసులో 9 మంది నిందితులకు హైదరాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధించింది. వీరిలో 8 మంది బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నారు. మహిళలకు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించిన నిందితులు వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. దీనిపై 2019లో పోలీసులు కేసు నమోదు చేయగా ఏన్ఐఏ అధికారులు రీ-రిజిస్టర్ చేశారు. A1 నుంచి A12 వరకు మొత్తం 12 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు.
- Advertisement -



