Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిజామాబాద్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌.. ఆర్ఐ మృతి

నిజామాబాద్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌.. ఆర్ఐ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌. సతీష్‌ దుర్మరణం చెందారు. పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన సతీష్‌ ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న సీపీ సాయి చైతన్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -