నవతెలంగాణ-వర్ధన్నపేట
ప్రస్తుత వర్షాకాల సీజన్లో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముగింపు గ్రామసభ సర్పంచ్ బత్తిని దశరథం అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిశుభ్రతతో పాటు, యూరియా యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తడిచెత్త, పొడి చెత్త వేరుచేసి, చెత్తను చెత్త బండిలోనే వేయాలని తెలిపారు. మరోవైపు త్వరలోనే పాఠశాలల ప్రారంభం కానున్నాయని, ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు చేర్పించాలని తలిదండ్రులకు సూచించారు. సర్కారు పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. వర్షాకాల సీజన్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో రామ్ రెడ్డి, వరంగల్ జెడ్పీ సీఈఓ, ఎంపీఓ, తహశీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకట రమణ, ఉప సర్పంచ్ మంద సుకన్య – అమరేందర్ వార్డు సభ్యులు,వ్యవసాయ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, ఇరిగేషన్ ఐకెపి వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ముగింపు గ్రామసభకు హాజరైన కలెక్టర్ డా. సత్య శారద
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



