Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు

ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆఫ్ఘనిస్థాన్ లోని పలు ప్రాంతాలపై మంగళవారం రాత్రి పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈదాడుల్లో సుమారు 13 మంది మరణించారు. మృతుల్లో 11మంది చిన్నారులు ఉన్నారని, మిగిలిన ఇద్దరిలో ఒక వృద్ధుడు, మహిళ ఉన్నట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం అర్థరాత్రి దాటాక ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్ ల్లోని పౌర నివాసాలే లక్ష్యంగా ఈదాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. సెర్పా జిల్లాలోని ఒక నివాసంపై జరిగిన దాడిలో సుమారు 9మంది మరణించారని, మరో 10మంది గాయపడ్డారని అన్నారు. పక్తికా ప్రావిన్స్ పై దాడిలో ముగ్గురు మరణించారని చెప్పారు. మృతులంతా చిన్నారులేనని, అర్థరాత్రి సమయంలో ఈ దాడులు జరగడంతో వారంతా నిద్రలోనే మరణించారని తెలిపారు. గాయపడిన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య గత కొన్ని నెలలుగా ఘర్షణలు నెలకొన్న సంగతి తెలిసిందే. తమపై దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లకు, ముఖ్యంగా తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి)కి ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -