Tuesday, August 11, 2026
E-PAPER
Homeఆటలుక్రికెట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్

క్రికెట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అరెస్టయ్యాడు. లైంగిక దాడి ఆరోపణలతో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలియజేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అలాగే తనపై దాడి చేసి నేరపూరితంగా బెదిరించాడని ఆరోపిస్తూ ఓ యువతి గత జూన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత, ఈ కేసు సంబంధించి ఆ క్రికెటర్‌ను అరెస్టు చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డుమ్ డుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘ఎమామి సిటీ’ వద్ద పోలీసులు ఈ బెంగాల్ క్రికెటర్‌ను అరెస్టు చేశారని తెలియజేశారు ఎస్పీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -