నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోనె లహరి రఘు అన్నారు. పట్టణ మున్సిపల్ కార్యాలయం యందు మంగళవారం చేయూత పింఛన్ల కొరకు దరఖాస్తులను స్వీకరించినారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. వితంతు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ వాళ్లు పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరినారు .కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి ,సంక్షేమానికి కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ల తో అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు . పట్టణంలోని పలు వార్డుల కౌన్సిలర్లు సైతం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



