నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం కు అదేవిధంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ మాసం కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో మండల మరియు గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడి పలు సమస్యల పరిష్కారానికి ఆయన దిశా నిర్దేశం చేశారు.
అదేవిధంగా మండలంలో ఐసిడిఎస్ జరుగుతున్న పోషణ మాసం కార్యక్రమాల గురించి తెలుసుకొని మరింత మెరుగుగా కార్యక్రమం జరగాలని అధికారులకు సూచించారు. అనంతరం సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీని అధికారులు,ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో జిసి మున్నయ్య, ఎంపీఓ రవికుమార్, పలు శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



