Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ కెమెరాలు గ్రామం యొక్క ప్రాపర్టీ 

సీసీ కెమెరాలు గ్రామం యొక్క ప్రాపర్టీ 

- Advertisement -

– ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి 
– నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వండి సిపి సాయి చైతన్య 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
: సీసీ కెమెరాలు గ్రామం యొక్క ప్రాపర్టీ అని సిపి సాయి చైతన్య మంగళవారం అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల క్రైమ్ కేసుల తనిఖీ గురించి వచ్చిన సిపి చైతన్య జక్రం పెళ్లి మండల కేంద్రంలోని  గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిసి కెమెరాలు లేకుంటే మహారాష్ట్ర యూపీ నుంచి వచ్చి దొంగతనాలు చేస్తున్నారని కావున ప్రతి గ్రామానికి సిసి కెమెరాలు అవసరం అన్నారు. దొంగతనం అనేది పురేకో వెర్రి అని శాస్త్రం ఉందని అభిమానించారు.

ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. టౌన్ కి వెళ్తే నువ్వు జిల్లాకు వెళ్తేనో హెల్మెట్ ధరించాలి కానీ మీ గ్రామంలో కూడా ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. కారులో సీటు బెల్టు ధరించాలన్నారు. నీ గురించి మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. జక్రాన్ పల్లి లో మంచి వాలిబాల్ క్రీడాకారులు ఉన్నారని అభినందించారు. గ్రామంలో గాని మండలంలో గాని ఏ గ్రామంలోనైనా సరే నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ ఏసిపి డిచ్పల్లి సిఐ ఎస్ఐ గ్రామ సర్పంచ్ బండి పద్మసత్యం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం సంజయ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -