Tuesday, August 11, 2026
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌లోనూ జంతర్ మంతర్ దృశ్యాలే

జార్ఖండ్‌లోనూ జంతర్ మంతర్ దృశ్యాలే

- Advertisement -
  • కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే జార్ఖండ్ విద్యార్థులపై లాఠీచార్జ్ సంఘటనను తీవ్రంగా ఖండించారు. పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ లను వ్యతిరేకిస్తూ రాంచీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టీయర్ గ్యాస్, లాఠీచార్జ్ ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయేతర నిరసనలపై ఈ తరహా పద్దతులు అనుసరించడమేంటని మండిపడ్డారు.

“నిన్న జార్ఖండ్‌లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద మనం చూసిన దృశ్యాలే జార్ఖండ్‌లోనూ కనిపించాయి, అక్కడ విద్యార్థులపై బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టినప్పుడు లాఠీచార్జీలు లేదా బాష్పవాయువు ప్రయోగం వంటి చర్యలు ఎందుకు చేపట్టరో నాకు అర్థం కావడం లేదు. కేవలం విద్యార్థులపైనే బాష్పవాయువును, లాఠీలతో ఎందుకు దాడి చేస్తున్నారు?” అని దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -