Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయంకేరళం బిల్లుకు ఆమోదం

కేరళం బిల్లుకు ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు. రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే, బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీస్ చర్యలకు గాను పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -