Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన వారు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో

అర్హులైన వారు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్: ఆలేరు మండలంలోని వివిధ గ్రామాల్లో కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ‘చేయూత’ పథకం కింద కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, అలాగే రక్త సంబంధిత రుగ్మతలైన థలసీమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియాతో బాధపడుతున్న అర్హులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడం, ప్రజాపాలన కార్యక్రమంలోనూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అర్హులైన ఆశావాహుల్లో కొంత గందరగోళం నెలకొన్నదన్నారు. అయితే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఆగస్టు 31 వరకు ఉందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత మండల కార్యాలయాల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. దరఖాస్తులను కేవలం సంబంధిత పంచాయతీ కార్యదర్శులకే అందజేయాలని, మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని హెచ్చరించారు. ఇతర శాఖలకు చెందిన వ్యక్తులకు కూడా దరఖాస్తులు అందజేయకుండా జాగ్రత్త వహించాలని ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -