నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ లతో కలిసి నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పూర్తిచేసి, మెయిన్ రోడ్డు నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు రోడ్డును అభివృద్ధి చేసుకుందామని, మున్సిపల్ ఫండ్ నిధులతో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, వినాయక నిమజ్జనం కంటే ముందే మినీ ట్యాంక్ బండ్, సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సడక్ వినోద్, భూపేందర్, సీనియర్ నాయకులు మెడిసిటీ దాము, శాల ప్రసాద్, సుమన్, గంగూలీ, తాటి హనుమాన్లు, చిట్టి రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ వాసు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


