నవతెలంగాణ – కామారెడ్డి
సమాజ సేవలో ముందుండే తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా సుభాష్‌రెడ్డి బృందం సభ్యులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో బోదాస్ సాయికుమార్, నీల స్వామి, బాణాపూర్ స్వామి రక్తదానం చేశారు. సమాజ సేవ చేస్తున్న సుభాష్‌రెడ్డి చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాంపల్లి ఉపసర్పంచ్ జాలిగమ స్వామి, పెంజర్ల సురేష్‌రెడ్డి, పట్లూరి ప్రశాంత్‌రెడ్డి, సంతోష్ మేజీషియన్, ఆకుల నాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



