– పురపాలక సంఘం కమిషనర్ టి మల్లికార్జున్ గౌడ్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
పట్టణంలో విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పురపాలక సంఘం కమిషనర్ టి మల్లికార్జున్ గౌడ్ సూచించారు. మంగళవారం హుస్నాబాద్ లో మున్సిపల్ అధికారులు, ఏ ఎన్ఎం, ఆశ కార్యకర్తలతో విష జ్వరాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పట్టణంలో శానిటేషన్, స్ప్రేయింగ్, ఫాగింగ్ మరియు ప్రత్యేక క్లీనింగ్ చేయలన్నారు.
ఎక్కడైనా దోమల సమస్య, నీరు నిల్వ ఉండటం లేదా పారిశుధ్య సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత ప్రాంతాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్, శుభ్రత చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ దండి లక్ష్మీ,, వైస్ చైర్‌పర్సన్ పద్మ , కౌన్సిలర్లు శ్రీనివాస్, సంపత్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



