Wednesday, June 10, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ముదిగొండలో వేలాది మందితో ఎర్ర జెండా కవాతు

ముదిగొండలో వేలాది మందితో ఎర్ర జెండా కవాతు

- Advertisement -
  • భారీ ర్యాలీ, బహిరంగ సభతో ప్రారంభమైన ఖమ్మం జిల్లా AIAWU 25వ మహాసభలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో ఎర్రజెండాల సముద్రంగా మారింది. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) ఖమ్మం జిల్లా 25వ మహాసభలు అపూర్వ ఉత్సాహం, పోరాట స్ఫూర్తి, విప్లవాత్మక వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది వ్యవసాయ కార్మికులు, పేదలు, మహిళలు, యువత ఎర్రజెండాలు చేతబూని కదం తొక్కుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు.

ముదిగొండ భూపోరాట అమరవీరుల స్తూపం వద్ద అమరుల త్యాగాలకు నివాళులర్పించిన అనంతరం, వారి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. “ఈ దేశ రాజ్యాంగాన్ని మనుధర్మ శాస్త్రంగా మార్చే ప్రయత్నాలను తిప్పికొడతాం – ప్రజాస్వామిక, లౌకిక, సామాజిక న్యాయ విలువలను కాపాడుకుంటాం” అని సభికులు నినదించారు.

ఎర్రజెండాల రెపరెపల మధ్య మారుమోగిన నినాదాలతో వెంకటాపురం గ్రామం పోరాట క్షేత్రంగా మారింది. భూమి, భుక్తి, గౌరవం కోసం సాగుతున్న వ్యవసాయ కార్మికుల ఉద్యమాలకు ఈ మహాసభలు కొత్త దిశానిర్దేశం చేయనున్నాయని నాయకులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -