Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌లో కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్

పాక్‌లో కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఓ ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌ బుధవారం ముజఫరాబాద్ సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ దేశ ఆర్మీకి చెందిన‌ ఎంఐ-17 హెలికాప్టర్ ఒక్క‌సారిగా నేల‌కూపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో హెలికాప్టర్‌లో ఉన్న సిబ్బంది అందరూ మరణించార‌ని పాకిస్తాన్ డాన్ పత్రిక పేర్కొంది. సంఘ‌ట‌న స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై స‌మాచారం తెలియాల్సింది.

పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) అసిమ్ మునీర్ ఈ దుర్ఘ‌ట‌న‌ పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. ఈ ప్ర‌మాదంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తామ‌ని, విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -