నవతెలంగాణ-ఆలేరు టౌన్
సిద్దిపేట, బచ్చన్నపేట బస్సులు రైల్వే గేట్ ఆలేరు పాత ఊరు నుండి నడిచేలా చర్యలు తీసుకోవాలని బుధవారం 11వ వార్డు కౌన్సిలర్ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజని బాలమని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నిత్యం వందలాదిమంది బచ్చన్నపేట, సిద్దుల గుట్ట, కోడవటూరు, చేర్యాల, సిద్దిపేట వైపు ఆలేరు రైల్వే గేట్ ఇతరులు వైపు వున్న 6 వార్డుల నుండి బస్సులలో ప్రయాణిస్తుంటారన్నారు.
11వ వార్డులో అభివృద్ధి కోసం సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఆధునికంగా మార్చాలని, అర్హులైనటువంటి అందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా కేటాయించాలని, సిద్దిపేట బచ్చన్నపేట బస్సులు ఆలేరు రైల్వే గేట్ పాత ఊరు మీదిగా నడపాలని వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్ కోరారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లేని దగ్గర కొత్త లైన్ వేయాలని, గతంలో వేసిన అండర్ డ్రైనేజీ పూర్తిగా విఫలమై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విన్నవించారు. ఆలేరు గెట్ 11వ వార్డు పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కమిషనర్లను కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బీజన్న బాలమణి భాస్కర్ మాట్లాడుతూ.. రూ. 30 కోట్ల అత్యధిక నిధులు కేటాయించి, ఆలేరు అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇప్పిస్తానని, పోచమ్మ గుడి నుండి బ్రహ్మంగారి గుడి వరకు అండర్పాస్ ఈ వార్డుకే ఎక్కువగా ఇండ్లు కోల్పోయినందున ఎక్కువగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ బీజణి బాలమణి భాస్కర్, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. వార్డు అభివృద్ధికి సహకరిస్తా అని తెలియ జేసినందుకు , వార్డు ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



