Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్ సర్వే చివరి దశలో గందరగోళం..!

డేంజర్ జోన్ సర్వే చివరి దశలో గందరగోళం..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్ల బ్లాక్-1 ఓసీపీకి డేంజర్ జోన్లో 500 మీటర్ల దూరంలో భూసేకరణ ప్రక్రియ కార్యక్రమం మొదటి నుంచి విస్తృతంగా కొనసాగుతున్నా.. చివరి దశలో మాత్రం గందరగోళంగా తయారైందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మంగళవారం మారింది. సర్వే బృందాల్లో భాగంగా 1వ, 5వ టీమ్స్ సమయ పాలన పాటిస్తూ సర్వే సాపిగా చేస్తుంటే, 2వ, 4వ టీమ్స్ నిర్వాసితులతో దురుసుగా ప్రవర్తిస్తూ సమయపాలన పాటించడం లేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అదంతే అంటున్నారని వాపోతున్నారు.ఈ విషయాన్ని నిర్వాసితులు స్థానిక తహశీల్దార్, కాటారం ఆర్డీఓల దృష్టికి సోషల్ మీడియా, చేరవాణి ద్వారా తీసుకపోయినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్వే టీమ్స్ పై చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.రెండు రోజుల్లో సర్వే వందశాతం పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -