Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలి: సర్పంచ్

పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఉచిత పశువైద్య శిబిరాలను పశువుల దారులు వినియోగించుకోవాలని రూసేగావ్ గ్రామ సర్పంచ్ సుమన్బాయి కోరారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా డాక్టర్ వినీత్ కుమార్ 39 పశువులకు గర్భ కోశా వ్యాధి చికిత్సలు, 25 పశువులకు సాధారణ చికిత్సలు చేశారు. 21 దూడలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, గ్రామ పెద్దలు గ్రామస్తులు, పశువుల దారులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -