Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ స్టేషన్ తనిఖీ చెసిన..ఎస్పీ సిరిశెట్టి సంకీర్థు

పోలీస్ స్టేషన్ తనిఖీ చెసిన..ఎస్పీ సిరిశెట్టి సంకీర్థు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ ను మంగళవారం జిల్లా ఎస్పీ,సిరిశెట్టి సంకీర్ట్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ భవనం, పరిసరాలు, సిబ్బంది హాజరు,విధి నిర్వహణను పరిశీలించారు. అలాగే స్టేషన్లోని ముఖ్యమైన, ఆన్లైన్ రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు విధులపై స్పష్టత ఉండాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కేసుల విచారణలో ఆలస్యం చేయొద్దని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జున రావు, కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -