Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంనెహ్రూ పేరిట ఉన్న రికార్డు బ్రేక్..మోడీకి రాష్ట్రపతి శుభాకాంక్షలు

నెహ్రూ పేరిట ఉన్న రికార్డు బ్రేక్..మోడీకి రాష్ట్రపతి శుభాకాంక్షలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రధానిగా మోడీ 4,3999 రోజుల్ని పూర్తి చేసుకున్నారు. దీంతో జవహర్‌‌లాల్‌ ‌నెహ్రూ పేరిట ఉన్న (4,398 రోజులు) రికార్డును బ్రేక్‌ ‌చేశారు. భారతదేశంలో అత్యధిక కాలం పాటు అవిచ్ఛిన్నంగా సేవలందించిన ఎన్నికైన ప్రధాన మంత్రిగా మోడీ నిలిచినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో గత పన్నెండేళ్లలో దేశంలో వివిధ రంగాల్లో భారీ మార్పులొచ్చాయని ముర్ము పోస్టులో పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి మోడీ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిన సందర్భంగా ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) బుధవారం ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపింది. అదే విధంగా పీఎంగా అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోడీకి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆయనను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మంత్రివర్గ సభ్యులు ప్రధాని మోదీకి నిలబడి చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -