నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో అక్రమంగా తరలిస్తు పట్టుబడ్డ ఇసుకను బుధవారం నయాబ్ తహసీల్దార్ తెలంగ్ రావు ఆధ్వర్యంలో బుధవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో మొత్తం మూడు ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, ఒక ఐచర్ వాహనంలోని ఇసుక కు వేలం పాట నిర్వహించారు. వేలంపాటలో మొత్తం 23 మంది పాల్గొనగా, అందులో ఐదుగురు ఇసుకను దక్కించుకున్నారు. ముధోల్‌కు చెందిన అనిల్ రెండు టిప్పర్ల ఇసుకను రూ.1,01,000కు దక్కించుకోగా, యూనిస్ హైమద్ రెండు టిప్పర్ల ఇసుకను రూ.68వేలకు పొందారు. ఆమన్ రెండు ట్రాక్టర్ల ఇసుకను రూ.5,650కు, పోతన్న ఒక టిప్పర్ ఇసుకను రూ.21వేలకు, ఎస్‌కే ఆసిన్ ఒక ట్రాక్టర్ ఇసుకను రూ.3,150కు సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నయాబ్ తహసీల్దార్ మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జయరావు, జూనియర్ అసిస్టెంట్ సోయల్ తదితరులు పాల్గొన్నారు.



