Friday, May 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ రైతులకు శుభవార్త..

తెలంగాణ రైతులకు శుభవార్త..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయశాఖ వారు పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఏకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, ప్రత్తి 4753 ఎకరాలలు మరియు ఇతర పంటలు 477 ఎకరాలలో (ప్రాణహిత వరదల మూలంగా సంభందించిన నష్టం) పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -