- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -