జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి పశువులు వచ్చే అవకాశం ఉందని భూపాలపల్లి జిల్లా పశువైద్యాధికారి ఏ.కుమారస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రమైన తాడిచెర్ల పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్రీడింగ్ సీజన్లో కృతిమ గర్భధారణను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కృతిమ గర్భధారణ ద్వార వచ్చే మేలు జాతీ పశువుల నుంచి అధిక పాల దిగుబడి,రోగ నిరోధిక శక్తి ఉంటుందని దీనివల్ల రైతు ఆర్థికంగా బలపడతాడని సూచించారు.
ఈ నేల 8 నుండి 22 వరకు గొర్రెలు మేకలకు జరిగే పోచమ్మ టీకాల కార్యక్రమాన్ని గొర్రెల,మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాడిచెర్ల, మల్లారం గ్రామాల్లోని ఆసుపత్రులలో విరిగిపోయిన తలుపులు, కిటికీలపై మరమ్మత్తుల గురించి సంబంధించిన సెక్రటరీకి ఫైల్ సమర్పించామని, బడ్జెట్ విడుదలైన వెంటనే ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న మరమ్మత్తులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి అభిలాష్,సిబ్బంధి సురేందర్, నాగరాజు, సమ్మక్క, పాడి రైతులు పాల్గొన్నారు.


