నవతెలంగాణ – రాయపర్తి
ఇటీవల జరిగిన సిఐటియు మహాసభ సందర్భంగా రాయపర్తి మండలం మైలారం గ్రామ పంచాయతీ కారోబార్ గూడేల్లీ ఉప్పయ్యను యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కమిటీకి మండలానికి చెందిన లక్ష్మణ్ (సన్నూరు), గారె ఉపేందర్ (పెర్కవేడు), ఐత పద్మ (రాయపర్తి), బానోత్ చంద్రును ( ఏకే తండా) ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఉప్పలయ్య మాట్లాడుతూ… కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాలు నెరవేర్చే వరకు పోరాడుతాం అన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా, సస్యశ్యామలంగా ఉంటున్నాయి అంటే గ్రామపంచాయతీ సిబ్బంది పుణ్యమే అన్నారు. పల్లెలను కడిగిన ముత్యంల చేసే గ్రామపంచాయతీ సిబ్బంది బతుకులు చాలీచాలని జీతాలతో మగ్గిపోతున్నాయని బాధపడ్డారు. గ్రామాలను పరిశుభ్రంగా చేసే కార్మికుల బతుకులు ప్రభుత్వాల అలసత్వం వలన అపరిశుభ్రంగా మారిపోతున్నాయని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా గూడేల్లీ ఉప్పయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES