- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాజిల శ్రీనివాస్ నాయకత్వంలోని బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా న్యాయవాది గోటిపాములు బాబురావు ని నియమిస్తూ జాజుల శ్రీనివాస్ గౌడ్ బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ కుల సంఘాలను ఐక్యం చేస్తూ రాబోయే రోజుల్లో బీసీల హక్కులను సాధించుట కొరకు ఈ యొక్క కమిటీ నియామకం జరిగిందని జిల్లాలో బాబురావు నాయకత్వంలో బిసి ఉద్యమాలు జరుగుతుందని వారు తెలిపారు.
- Advertisement -