- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు, వ్యాపారస్తులకు తీపి కబురు అందించింది. రంజాన్ మాసంలో రాత్రంతా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల వ్యాపార వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. హలీమ్ సెంటర్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల ఆదేశాలు జారీ అయ్యాయి. 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులకు ప్లాన్ చేస్తున్నాయి.
- Advertisement -



