ఇసుక సమస్య పరిష్కరించాలని ఆర్డీవోకు వినతి
డి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్ గౌడ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో 171 ఇండ్లు మంజూరు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక సహాయం చేస్తామన్న హామీలో పూర్తిగా విఫలమైందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం బి.ఎస్.పి నాయకులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుక సమస్య పరిష్కరించాలని ఆర్డీవో రామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే ఇండ్లకు ఇసుక టోకెన్లు ఇచ్చి ఇసుక ఎక్కడ తెచ్చుకోవాలో అధికారులు చెప్పడం లేదన్నారు. దీంతో లబ్ధిదారులకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకలో ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.6000 వేల నుండి రూ.8000 అక్రమంగా ఇసుక మాఫియా వసూలు చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.3 వేలు ఉన్న ఇసుక ఈరోజు రూ.8 వేలకు చేరిందంటే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలని అన్నారు. సత్వరమే పొట్లపల్లి గ్రామంలో ఉన్న ఇసుకను హుస్నాబాద్ మండలంలోని గ్రామాలకు, హుస్నాబాద్ పట్టణంలో రెండు వేల రూపాయలకు ఇసుక దొరికే విధంగా మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీనియర్ నాయకులు మారెపల్లి సుధాకర్, ఎలగందుల శంకర్ ఉన్నారు.
ఉచిత ఇసుక అందించడంలో ప్రభుత్వం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES