Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసేవకు ప్రతిరూపం ప్రభుత్వ వైద్యశాలలు

సేవకు ప్రతిరూపం ప్రభుత్వ వైద్యశాలలు

- Advertisement -

నర్సింగ్‌ ఆఫీసర్ల కాన్ఫరెన్స్‌లో డీఎంఈ డాక్టర్‌ ఎ.నరేంద్రకుమార్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సేవకు ప్రతిరూపం ప్రభుత్వ వైద్యశాలలు అని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎమ్‌ఈ) డాక్టర్‌ ఎ.నరేంద్రకుమార్‌ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రిలోని నట్కో బిల్డింగ్‌ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి నర్సింగ్‌ ఆఫీసర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో 200 మందికిపైగా డెలిగేట్లు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్‌ నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాలలు లాభాపేక్ష లేకుండా ప్రతి రోగిని కూడా అక్కున చేర్చుకొని సేవలు అందిస్తున్నాయన్నారు. నర్సులు కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనీ, ఇలాంటి కాన్ఫరెన్స్‌ల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. నర్సులు నిబద్ధతతో సేవలందిస్తూ రోల్‌మోడల్‌గా నిలవాలనీ, ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటూ రోగికి సురక్షిత సేవలు అందించాలని కోరారు.

నవజాత శివు సంరక్షణలో అభివృద్ధి, ఇన్నోవేషన్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీలో అభివృద్ధి, నర్సింగ్‌ దృక్పథాలు, మెటర్నల్‌ కేర్‌ సేవలు, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ పద్ధతులు, నర్సింగ్‌ ఆఫీసర్ల జాబ్‌ చార్ట్‌ (బాధ్యతలు), నర్సింగ్‌ జ్యూరిస్‌ప్రుడెన్స్‌, పీర్‌ రివ్యూలో ఎథిక్స్‌, తదితర అంశాలపై పలువురు స్పీకర్లు సందేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైన్డ్‌ నర్సుల అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రాజేశ్వరి, రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ విద్యులత, యశోద ఆస్పత్రి(సికింద్రాబాద్‌) నర్సింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ జ్యోతి శర్మ, నీలోఫర్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ విజయ్ కుమార్‌, సీఎస్‌ఆర్‌ఎమ్‌వో డాక్టర్‌ ఆనంద్‌, నీలోఫర్‌ నియోనెటాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ స్వప్న, చీఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్లు బాలమణి, కరుణ, రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ లాలూ ప్రసాద్‌, తెలంగాణ ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ రుదావత్‌, నర్సింగ్‌ ఆఫీసర్లు కృష్ణ, సోమేష్‌, పాండు, నవనీత, మానస, యూనిస్‌, దీపిక, అనురాధ, ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -